Breaking News

మద్నూర్‌లో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

మద్నూర్, సెప్టెంబర్ 8:(E6tv న్యూస్: ప్రతినిధి).

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం అంతర పాఠశాలల మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. సర్పంచ్ ఉష, ఎంఈవో రాములు క్రీడా పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, సమష్టి భావన పెంపొందుతాయని తెలిపారు.

రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాజేందర్, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *