Breaking News

మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వన మహోత్సవం

మద్నూర్, ఆగస్టు 25:(E6tv NEWS: ప్రతినిధి). ప్రతినిధిమండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ పీడీ కుటుంబరావు, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ మొక్కలు నాటారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీవో పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్ రేకుల్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *