Breaking News

సుల్తాన్‌పేట్‌లో SIR–2026పై గ్రామసభ

మద్నూర్, ఆగస్టు 27: (E6tv NEWS: ప్రతినిధి).

మద్నూర్  మండలం సుల్తాన్‌పేట్ గ్రామంలో SIR–2026 ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ తహసీల్దార్ పాల్గొని ఓటరు జాబితాలో పేర్ల నమోదు, వివరాల్లో మార్పులు, అనర్హుల పేర్ల తొలగింపు తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

ఓటరు నమోదు ప్రక్రియలో ఏవైనా తప్పులు, అవకతవకలు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లయితే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధానాన్ని తహసీల్దార్ వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి వెంటనే సవరణలు చేసుకోవాలని కోరారు.ఈ గ్రామసభలో సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, కార్యదర్శి సంజయ్ కుమార్, GPO సత్యం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *