Breaking News

భీంగల్‌లో ఘనంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు

భీంగల్, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్).

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం భీంగల్ మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బొదిరె స్వామి మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *