Breaking News

మెగా జాబ్ మేళాతో 2 వేలకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

మెగా జాబ్ మేళాతో 2 వేలకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఆగస్టు 9న శ్రీరామ గార్డెన్‌లో మెగా జాబ్ మేళా

60కు పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యం

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యం

నిజామాబాద్, ఆగస్టు 6: (E6 ‘tv NEWS శివ ఠాకూర్).
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్డులో ఉన్న శ్రీరామ గార్డెన్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ జాబ్ మేళాలో 60కు పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని, 2 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ తదితర విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశ్రమలు–నిరుద్యోగుల మధ్య వారధిగా నిలిచి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

నిజామాబాద్ యువతలో అపారమైన ప్రతిభ ఉందని, వారికి సరైన మార్గదర్శకత్వం అందించడం తన బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గించేందుకే ప్రముఖ కంపెనీలను నేరుగా నిజామాబాద్‌కు తీసుకొస్తున్నట్లు తెలిపారు.అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల ధ్రువపత్రాల ప్రతులు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో ఆగస్టు 9న ఉదయం 9 గంటల నుంచి శ్రీరామ గార్డెన్‌లో హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు. జాబ్ మేళా నిర్వహణకు సహకరిస్తున్న కంపెనీలు, వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *