Breaking News

పేదల సంక్షేమమే ధ్యేయం.. అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు

జుక్కల్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

జుక్కల్, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి)

పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులైన నిరుపేద కుటుంబాలకు సుమారు 87 వేల స్మార్ట్ రేషన్ కార్డులు అందించినట్లు తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే తొలి ప్రాధాన్యత

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అర్హత కలిగిన ఏ కుటుంబం కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆహార భద్రతతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు పొందేందుకు మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *