Breaking News

దినేష్ కులచారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

జక్రాన్‌పల్లి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జక్రాన్‌పల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దినేష్ కులచారి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీ శివలింగేశ్వర స్వామివారిని ప్రార్థించారు.

అనంతరం అంకాపూర్‌లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. దినేష్ కులచారి జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బట్టి దత్తాద్రి గౌడ్, కుంట శ్రీనివాస్ రెడ్డి, విక్రమ్, బీజేవైఎం నాయకులు శ్యామ్ రెడ్డి, క్రాంతి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *