Breaking News

మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల మంజూరు

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేత

ప్రభుత్వం రూ.32 లక్షలు – గ్రామస్థుల విరాళం రూ.8 లక్షలు

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్).
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కృషితో డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల నిధులు మంజూరు కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యేను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఆలయ నిర్మాణానికి గ్రామస్థులు తమ వంతుగా రూ.8 లక్షలు సమకూర్చగా, ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా రూ.32 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులకు సంబంధించిన అధికారిక ప్రొసీడింగ్స్ పత్రాన్ని ఎమ్మెల్యే భూపతి రెడ్డి గ్రామ ప్రతినిధులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలంతా ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగాలని, గ్రామ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే గ్రామస్థులు ఐక్యంగా పనిచేసి అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి సహకరించాలని పిలుపునిచ్చారు.అనంతరం మిట్టపల్లి గ్రామానికి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ బాల గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షుడు అంబట్ల లింబాద్రి, ప్రధాన కార్యదర్శి తంగళ్ల కిషన్, ఉపాధ్యక్షుడు సుంకట గంగారం, సీనియర్ నాయకులు మాసిపెద్ది రాజన్న, ఎండి అబీ ఖాన్, మాజీ సర్పంచ్ బిల్ల రమేష్, వార్డు సభ్యులు కొమ్మురోళ్ల గంగాధర్, వేల్పూర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *