Breaking News

ఉత్తమ సేవల అవార్డు అందుకున్న మద్నూర్ కానిస్టేబుల్ విట్టల్

మద్నూర్ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి).

ఉత్తమ సేవలు అందించినందుకు మద్నూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విట్టల్‌కు ప్రశంసా పత్రం లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ నవీన్ చంద్ర చేతుల మీదుగా విట్టల్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

ఇటీవల జరిగిన దారి దోపిడీ కేసులో నిందితులను గుర్తించడంలో కానిస్టేబుల్ విట్టల్ కీలకంగా వ్యవహరించారు. అలాగే మద్నూర్ మండల కేంద్రంలో ఆరేళ్ల చిన్నారి తప్పిపోయిన ఘటనలో చాకచక్యంగా స్పందించి బాలికను గుర్తించడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు.

ఈ రెండు ఘటనల్లో విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, సమయస్ఫూర్తి, బాధ్యతాయుత సేవలను ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ విట్టల్‌ను ప్రశంసా పత్రంతో సత్కరించి అభినందించారు. ఆయనకు అవార్డు లభించడంపై మద్నూర్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *