Breaking News

సీఎం సహాయనిధితో నిరుపేదకు అండగా

రూ.5 లక్షల ఎల్‌ఓసీ లేఖను అందజేసిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS శివ ఠాకూర్).

అత్యవసర వైద్య చికిత్స అవసరమైన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.

ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన నాయిక మహేష్ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స కోసం రూ.5 లక్షలు అవసరమని వైద్యులు సూచించడంతో, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.5 లక్షల ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లేఖను ఎమ్మెల్యే శనివారం తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేందర్‌తో పాటు గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *