పాల్వంచ, సెప్టెంబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి).
ప్రవక్త ముహమ్మద్ జన్మదిన మాసమైన రబీ-ఉల్-అవ్వల్‌ను పురస్కరించుకుని పాల్వంచ పట్టణంలో నేడు మిలాద్-ఉన్-నబీ సదస్సును నిర్వహించనున్నారు.ఆదివారం సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న మదర్సా అధ్యక్షుడు షేక్ యూసుఫ్ నివాసంలో ఒడ్డుగూడెం దారుల్ ఉలూమ్ నూరియా హనఫియా మదర్సా కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది.
ఈ సందర్భంగా ముఖ్య వక్తలు ప్రవక్త ముహమ్మద్ జీవిత విశేషాలు, బోధనలు, సందేశాలపై ప్రసంగించనున్నారు. మదర్సా విద్యార్థులు నాత్ షరీఫ్‌ను ప్రదర్శించనున్నారు.కార్యక్రమానికి ముస్లిం సమాజం పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. మహిళలు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా పర్థా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
మరిన్ని వివరాల కోసం 9848362129, 8520860785 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

