Breaking News

గుండెపోటుతో జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీ మృతి

జుక్కల్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) 

జుక్కల్ మండలం కౌలాస్ గ్రామానికి చెందిన విఠల్‌రావు పాటిల్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రభుత్వం తరఫున వాదించే సహాయ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ)గా విధులు నిర్వహిస్తున్నారు.తోటి న్యాయవాదులతో కలిసి రాజస్థాన్‌లోని సోమ్‌నాథ్ యాత్రకు వెళ్లిన విఠల్‌రావు పాటిల్ తిరుగు ప్రయాణంలో గురువారం జైపూర్ సమీపంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందారు.

శుక్రవారం ఆయన మృతదేహం స్వగ్రామమైన కౌలాస్‌కు చేరుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విఠల్‌రావు పాటిల్ మృతిపట్ల తోటి న్యాయవాదులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *