Breaking News

గాజులపేటలో పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక క్యాంప్

నిర్మల్, ఆగస్టు 14: (E6 tv NEWS:Md మొయినుద్దీన్).

స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో గాజులపేటలోని డ్రీమ్ బ్రిడ్జ్ స్కూల్‌లో శుక్రవారం పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు.

ఈ క్యాంపులో వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తు ఫారాలను నింపించారు. దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో క్యాంపునకు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం ఈ నెల 31వ తేదీలోగా అర్హులైన వారు తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. పెన్షన్ పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ ఇర్ఫాన్ సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నదీమ్, యూనుస్, కిజర్‌తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *