Breaking News

మోర్తాడ్ హోంగార్డుకు ప్రశంస పత్రం

ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో సమర్థవంతమైన సేవలు

మోర్తాడ్ ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి)

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మోర్తాడ్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ తిరుపతికి ఘనమైన గౌరవం లభించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా తిరుపతి ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అందించిన సేవలను గుర్తిస్తూ ఈ ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీహెచ్ తిరుపతిని అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది అభినందించారు.

తన సేవలను గుర్తించి ప్రశంస పత్రం అందజేయడం మరింత బాధ్యతతో విధులు నిర్వహించేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందని హోంగార్డు సీహెచ్ తిరుపతి తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *