Breaking News

దొరలను గడగడలాడించిన వీర వనిత చాకలి ఐలమ్మ

ముధోల్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).
తెలంగాణ సాయుధ పోరాటంలో దొరల అరాచకాలను ఎదిరించి, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ అన్నారు.ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోతన్న యాదవ్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ చూపిన తెగువ, ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి సమాజానికి ఆదర్శమని అన్నారు.

దొరల దౌర్జన్యాలకు, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. నేటి తరం యువత ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వం, హక్కుల కోసం ముందుకు సాగడమే ఆమెకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముధోల్ గ్రామ రజక సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు కోరిపోతన్న, మదన్ మోరే తదితరులు పాల్గొన్నారు.

– E6 TV ప్రతినిధి
ఆకుల తిరుపతి గౌడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *