Breaking News

సీజనల్ వ్యాధులపై అవగాహనకు షార్ట్‌ఫిల్మ్ ఆవిష్కరణ

నిజామాబాద్ ఆగస్టు 12: E6 tv NEWS ( శివ ఠాకూర్).వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన “మన ఆరోగ్యం మన చేతుల్లోనే” అనే షార్ట్‌ఫిల్మ్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆవిష్కరించారు.గోవిందపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మానస ఆధ్వర్యంలో, ఉపాధ్యాయుడు కోకిల నాగరాజు రచించి, రూపొందించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే సీజనల్ వ్యాధులు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈ షార్ట్‌ఫిల్మ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

షార్ట్‌ఫిల్మ్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందుతుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం షార్ట్‌ఫిల్మ్‌లో నటించిన విద్యార్థినులు, ఆశా కార్యకర్తలు, వైద్యాధికారి డాక్టర్ మానస, రచయిత, ఉపాధ్యాయుడు కోకిల నాగరాజులను సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *