నిర్మల్, ఆగస్టు 30: (E6tv NEWS: ప్రతినిధి)
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారపేట మోచి సంఘంలో ఎస్ఐఆర్ (SIR) ఫామ్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కత్తి నరేందర్, బీఎల్ఓ ఇంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఓటర్లు తమకు అందిన నోటీసుతో పాటు, పాత ఓటర్ జాబితా లేదా 2002 సంవత్సరానికి సంబంధించిన ఆధారాలు, అందుబాటులో ఉన్న ఇతర పాత డాక్యుమెంట్లు తీసుకుని బీఎల్ఓను సంప్రదించాలని కోరారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు హక్కు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి సూచించినట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత బీఎల్ఓను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బుధవారపేటకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.



