Breaking News

కుమార్తె వివాహానికి రాష్ట్ర ప్రముఖులను ఆహ్వానించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

హైదరాబాద్, ఆగస్టు 2: (E6 tv NEWS ప్రతినిధి). జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు తన కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని రాష్ట్ర స్థాయి ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికలను స్వయంగా అందజేశారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ ఆహ్వాన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వివాహానికి ఆహ్వానించారు.అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలోని పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులను కూడా కలిసి వివాహ ఆహ్వాన పత్రికలను అందజేసి వేడుకలకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆహ్వానం స్వీకరించిన రాష్ట్ర ప్రముఖులు తోట లక్ష్మీకాంతరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వివాహ వేడుక విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *