ఆగస్టు 8న నిజామాబాద్లో జనసేన రెండు జిల్లాల సన్నాహక సమావేశం
రాష్ట్ర ముఖ్య నాయకులంతా హాజరవుతారని వెల్లడి
కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు
నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్).
కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జనసేన పార్టీ ఆవిర్భవించిందని పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు అన్నారు. నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాల సంయుక్త సన్నాహక సమావేశాన్ని ఈ నెల 8వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుగుణ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ ప్రజల ఆశయాలను ప్రతిబింబించే రాజకీయ శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. కార్యకర్తల కృషిని గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే పార్టీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తారు
రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రాజకీయాల్లోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించనున్నారని మీసాల శ్రీనివాసరావు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు.
సన్నాహక సమావేశానికి రాష్ట్ర నాయకుల హాజరు
ఆగస్టు 8న నిర్వహించే సన్నాహక సమావేశానికి రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. రెండు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

పలువురు నాయకుల పాల్గొనిక
ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అబ్జర్వర్ శర్మ, మీడియా ఇన్చార్జి దుంపటి శ్రీనివాస్, జిల్లా నాయకుడు గుండా సంతోష్, కోరుట్ల నాయకుడు అజయ్, ఉప సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు రమేష్ బాసవేణి తదితరులు పాల్గొన్నారు.

