ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఆగస్టు 1 నుంచి 10 వరకు NATS 2.0 పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచన
నిజామాబాద్, జూలై 31: E6 tv NEWS( శివ ఠాకూర్).
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోలలో మూడు సంవత్సరాల అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ అవకాశాలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని రీజినల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంజినీరింగ్ విభాగంలో ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన ఇంజినీరింగ్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నాన్-ఇంజినీరింగ్ విభాగంలో బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ విద్యార్హతలు కలిగిన వారు కూడా అర్హులు.
2022 విద్యా సంవత్సరం లేదా ఆ తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ (NATS 2.0) పోర్టల్‌లో నమోదు చేసుకుని TGSRTC Nizamabad Region ఎంపిక చేసుకుని దరఖాస్తు సమర్పించాలని అధికారులు సూచించారు.ఎంపిక టీజీఎస్‌ఆర్టీసీ నిబంధనల మేరకు మెరిట్ ఆధారంగా నిర్వహించబడుతుందని, శిక్షణ కాలంలో ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా నిర్దేశిత స్టైఫండ్ చెల్లించనున్నట్లు తెలిపారు.
ఖాళీల వివరాలు:
ఇంజినీరింగ్/డిప్లొమా (ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఏఐ, మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్): 5 పోస్టులునాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు (B.Com, B.Sc, BBA, BCA, BA): 13 పోస్టులు
నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు (B.Com, B.Sc, BBA, BCA, BA): 13 పోస్టులు
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అధికారులు కోరారు.

