భద్రాచలం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి).
భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి. పార్వతి హాథీరామ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను శాలువా, బొకేతో ఘనంగా సత్కరించారు.
అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజన రైతులకు రావాల్సిన పోడు భూముల పట్టాలను ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు బాలాజీ నాయక్, డ్రెస్సింగ్ మండల నాయకులు శంభు నాయక్, దరావత్ సురేష్ బాల తదితరులు పాల్గొన్నారు.


