ఏర్గట్ల ఆగస్టు 14: (E6tv NEWS: T, గంగాధర్).
మండల కేంద్రంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఏర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి కోరారు. వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌తో కలిసి ఆయన గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్భంగా కిరాణా దుకాణాలు, చికెన్ సెంటర్లు, హోటళ్లను స్వయంగా సందర్శించి వ్యాపారులకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణహిత బయో ప్లాస్టిక్ బ్యాగులను సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి కిరాణా దుకాణదారులకు పంపిణీ చేశారు.గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ ఉపేందర్‌రెడ్డి కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.


