20 మంది అరెస్ట్.. గుడుంబా, అక్రమ మద్యం సీజ్
రాబోయే వారం స్పెషల్ డ్రైవ్: DPEO అరుణ్ కుమార్
నిజామాబాద్, ఆగస్టు 11: (E6 tv NEWS: శివ ఠాకూర్).
మత్తు పదార్థాల వినియోగం, అక్రమ విక్రయాలు, రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు DPEO పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్, మోర్తాడ్ ప్రాంతాలతో పాటు DTF, ఎన్ఫోర్స్మెంట్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మొత్తం 40 కేసులు నమోదు చేసి, 20 మందిని అరెస్ట్ చేసినట్లు DPEO నిజామాబాద్ అరుణ్ కుమార్ తెలిపారు. అలాగే 10 లీటర్ల గుడుంబా, 11 లీటర్ల NDPL, 25 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 20 కల్లు శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించారు.ప్రతి శాఖలో ఉద్యోగుల బదిలీలు సర్వసాధారణమేనని, అయితే బదిలీల కారణంగా విధుల్లో ఎలాంటి జాప్యం ఉండదని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. గత వారం అధికారులు సమన్వయంతో మంచి పనితీరు కనబరిచారని తెలిపారు.
వచ్చే వారం స్పెషల్ డ్రైవ్
మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు, అక్రమ రవాణాపై వచ్చే వారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు DPEO తెలిపారు. మత్తు పదార్థాలను వినియోగించే వారు, విక్రయించే వారు, రవాణా చేసే వారిపై ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అక్రమ మద్యం, మత్తు పదార్థాల నియంత్రణలో పోలీసుల సహకారం కూడా కోరుతున్నామని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేస్తూ, ప్రజలకు మరియు సమాజానికి సేవ చేసే దృక్పథంతో ముందుకు సాగుతామని తెలిపారు.

