గోజేగావ్ గ్రామస్థులకు ఎస్సై మోహన్‌రెడ్డి హెచ్చరిక
మద్నూర్ ఆగస్టు 5:E6 tv NEWS (M. మస్నాజీ)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామ ప్రజలు లేండి వాగు వరద పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై మోహన్‌రెడ్డి సూచించారు.బుధవారం లేండి వాగును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వాగు నీటిమట్టం మరింత పెరిగి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
గ్రామస్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరద నీటిలోకి వెళ్లకుండా, పిల్లలను వాగు పరిసరాలకు వెళ్లనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలని కోరారు.ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత అని పేర్కొన్న ఎస్సై మోహన్‌రెడ్డి, అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.

