Breaking News

మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు

మద్నూర్, ఆగస్టు 15:(E6tv NEWS: ప్రతినిధి).

మద్నూర్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. వేల్పూర్ మండలంలో విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై మద్నూర్ ఎంపీడీవోగా నియమితులయ్యారు.ఇప్పటివరకు మద్నూర్ ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పి. సాయిలు జాతీయ జెండాను ఆవిష్కరించి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీవో పి. సాయిలును అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో పి. సాయిలు సమర్థవంతంగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *