Breaking News

భీంగల్ ఎంపీడీవోకు ప్రశంసా పత్రం

నిజామాబాద్ ఆగస్టు 15: ,(E6 tv NEWS ప్రతినిది).

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భీంగల్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్‌కు ఘనమైన గౌరవం లభించింది. బోధన్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన సేవలను గుర్తిస్తూ ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా గంగుల సంతోష్ కుమార్‌ను అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది అభినందించారు. తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రం అందజేయడం మరింత బాధ్యతను పెంచిందని ఎంపీడీవో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *