మలాపూర్ గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
డోంగ్లీ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి).
కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం మలాపూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించి, గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధి, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందుకు ఆహ్వానం
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె జోనిట వివాహ విందు కార్యక్రమం ఆగస్టు 16వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు. బిచ్కుంద–కందర్పల్లి రోడ్డులోని DBL గ్రౌండ్‌లో ఉదయం 9 గంటలకు జరిగే ఈ వివాహ విందుకు మలాపూర్ గ్రామ ప్రజలందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.నూతన వధూవరుల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ, గ్రామ ప్రజలందరూ తమ ఆశీస్సులు అందించాలని సర్పంచ్ శ్రీకాంత్ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

