Breaking News

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలి

గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేయాలి

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి)

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.5 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరుతూ హుజూర్‌నగర్ పట్టణ జర్నలిస్టులు తహసీల్దార్ బండా కవిత, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, కమిషనర్ కే. సతీష్‌లకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.గత ప్రభుత్వ హయాంలో హుజూర్‌నగర్ పట్టణంలోని ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలాలకు పొజిషన్ ఇచ్చి, గృహ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమస్యను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్‌కు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *