Breaking News

పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

బహుజనుల హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న చరిత్రను తెలుసుకోవాలి

ఏర్గట్ల, ఆగస్టు 08: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్)
మండల కేంద్రం ఏర్గట్లలో బహుజన ముద్దుబిడ్డ పండుగ సాయన్న ముదిరాజ్ 134వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. శివాజీ, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద స్థానిక ముదిరాజ్ సంఘం సభ్యులు పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్గట్ల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రెండ్ల రవి, ఉపసర్పంచ్ ఫోరమ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్, బీసీ-ఎస్సీ-ఎస్టీ మండల జేఏసీ అధ్యక్షుడు జూంగల గణేష్, రెండ్ల రాజారెడ్డి, మాజీ అధ్యక్షుడు జూంగల పెద్ద గంగారాం బిగ్‌బాస్ మాట్లాడుతూ.. పండుగ సాయన్న నాటి తెలంగాణలో దొరలు, పెత్తందారులు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారని అన్నారు.

దోపిడీదారుల నుంచి స్వాధీనం చేసుకున్న సంపదను అన్యాయానికి గురైన పేద ప్రజలకు పంచి పెట్టి, వారి పక్షాన నిలిచిన గొప్ప వ్యక్తి పండుగ సాయన్న అని కొనియాడారు. బహుజనుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పండుగ సాయన్న జీవిత చరిత్రను తెలుసుకోవాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఇరపట్నం చిన్న గంగారాం, శ్రీనివాస్, రొక్కెడ సంజీవ్, కూరాకుల రమేష్, శ్రీనివాస్ గౌడ్, బాలు, గుర్రం చిరంజీవి, రామ్, లక్ష్మణ్, బుర్కాల ప్రభాకర్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *