మద్నూర్ ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి).
ఏళ్లుగా ఎదురుచూస్తున్న సలాబాత్‌పూర్ గ్రామస్థుల సమస్యకు పరిష్కారం లభించింది. సలాబాత్‌పూర్ గ్రామానికి ప్రత్యేకంగా నూతన పోలింగ్ బూత్ మంజూరు కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మద్నూర్ మండలం చిన్న శక్కార్గ గ్రామపంచాయతీ పరిధిలోని సలాబాత్‌పూర్, చిన్న శక్కార్గ గ్రామాలకు గతంలో ఒకే పోలింగ్ బూత్ ఉండేది. దీంతో ప్రతి ఎన్నికల సమయంలో సలాబాత్‌పూర్ గ్రామస్థులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని చిన్న శక్కార్గ గ్రామానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వచ్చేది.ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఓటు వేసేందుకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ కారణంగా గ్రామంలో ఓటింగ్ శాతం కూడా తగ్గుతున్న పరిస్థితి ఉండేది.
ఈ సమస్యను పలుమార్లు స్థానిక తహసీల్దార్‌కు గ్రామస్థులు వినతిపత్రాల ద్వారా తెలియజేశారు. సమస్యను గుర్తించిన అధికారులు SIR ప్రక్రియలో భాగంగా సలాబాత్‌పూర్ గ్రామానికి ప్రత్యేకంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు.దీంతో సలాబాత్‌పూర్ గ్రామస్థులు తహసీల్దార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి, మిఠాయిలు తినిపించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ బి. హన్మాండ్లు, బీజేపీ బూత్ అధ్యక్షులు బి. జ్ఞానేశ్వర్, యోగేష్, ఖాయుమ్, అంకిత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.సలాబాత్‌పూర్ గ్రామానికి ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు కావడంతో ఇకపై గ్రామస్థులు తమ ఓటు హక్కును సొంత గ్రామంలోనే సులభంగా వినియోగించుకోనున్నారు.

