Breaking News

లచ్మాపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించిన ఏఈఓ విశాల్ గౌడ్

రసం పీల్చే పురుగుల నివారణకు రైతులకు సూచనలు

లచ్మాపూర్, ఆగస్టు 1: (E6 tv NEWS M, మస్నాజీ)

లచ్మాపూర్ శివారులోని పత్తి పంటను వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) విశాల్ గౌడ్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి పంటలో రసం పీల్చే పురుగులైన పంచ దోమ, తెల్ల దోమ, పెను బంకలను గుర్తించి, వాటి నివారణకు రైతులు సకాలంలో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

పురుగుల నివారణ కోసం ఒక లీటర్ నీటికి ఏసిఫేట్ (Acephate) 1.5 గ్రాములు లేదా అసెటామిప్రిడ్ (Acetamiprid) 0.2 గ్రాములు లేదా థయామెథోక్సామ్ 25 WG (Thiamethoxam 25 WG) 0.2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలని రైతులకు వివరించారు. పంటను తరచూ పరిశీలిస్తూ, పురుగుల ఉధృతి కనిపించిన వెంటనే శాస్త్రీయ పద్ధతుల్లో నివారణ చర్యలు చేపడితే దిగుబడి నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు లక్ష్మణ్, అశోక్, మరోతి, హనుమంతు, శ్రీకాంత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *