మద్నూర్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి).
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా మద్నూర్ పోస్టు కార్యాలయంలో 40 మంది అర్హులైన లబ్ధిదారులకు వాషింగ్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు తెప్పవార్ తుకారాం, బీజేపీ యువ నాయకుడు అజయ్ తమ్మేవార్ తెలిపారు.
మద్నూర్ పోస్టు కార్యాలయానికి విశ్వకర్మ యోజనలో భాగంగా 40 వాషింగ్ మిషన్లు మంజూరు కాగా, అర్హులైన లబ్ధిదారులకు వాటిని అందజేశారు. ఈ మిషన్లు లబ్ధిదారుల జీవనోపాధికి, స్వయం ఉపాధి అవకాశాల మెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని నాయకులు పేర్కొన్నారు.వాషింగ్ మిషన్లు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సబ్ పోస్టుమాస్టర్, గ్రామీణ డాక్ సేవకులు (జీడీఎస్), మండల అధ్యక్షుడు తుకారాం, సర్పంచ్ మాధవ్, అజయ్ తమ్మేవార్, శివ, శివన్న, యోగేష్, నరేష్ తదితరులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

