Breaking News

వరుణ యాగం చివరి రోజు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రత్యేక పూజలు

నిజామాబాద్, ఆగస్టు 8: (E6 tv NEWS, శివ ఠాకూర్)
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వరుణ యాగం శనివారం తో ముగియనుంది. మార్కెట్ కమిటీలోని మర్చంట్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగం చివరి రోజు కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వరుణ యాగం పూర్ణాహుతి యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలకు అనుకూల వాతావరణం ఏర్పడాలని ప్రార్థించారు.మూడు రోజులుగా నిర్వహించిన వరుణ యాగంలో మార్కెట్ కమిటీ వ్యాపారులు, రైస్ మిల్లర్లు, రైతులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. చివరి రోజు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు పలువురు వ్యాపారులు, రైతు ప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వర్షాలు సమృద్ధిగా కురిసి నిజామాబాద్ జిల్లా రైతాంగానికి మంచి పంటలు పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *