ఏర్గట్ల, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి).
వినాయక చవితిని పురస్కరించుకొని ఏరుగట్లలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మట్టి గణపతుల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు వివిధ ఆకృతుల్లో ఎంతో అందంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మట్టి గణపతుల ప్రాశస్త్యంతో పాటు వినాయక చవితి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను వినియోగించడం ఎంతో ముఖ్యమని సూచించారు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ.. ప్రకృతికి అనుకూలమైన మట్టి గణపతులను పూజించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా వ్యవహరించి మట్టి గణపతులను ప్రోత్సహించాలని కోరారు.తెలుగు పండితులు గంగాధర్, ప్రవీణ్ శర్మలు వినాయకుని గొప్పతనం, వినాయక చవితి పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునురుద్దిన్, ప్రసాద్, విజయ్, రాజనర్సయ్య, రాజేందర్, సబిత, ట్వింకిల్ గంగా, మోహన్, శ్యామల, కృష్ణవేణి, రిషిక తదితరులు పాల్గొన్నారు.

