Breaking News

బస్వాపూర్‌లో తాగునీటి సరఫరాపై సమీక్ష

బస్వాపూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).
బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ పనితీరుపై గ్రామ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఏఈ రాచప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై సమీక్షించారు.గ్రామంలోని మూడు వాటర్ ట్యాంకులు, 5 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లు, ఏడు సింగిల్‌ఫేజ్ మోటార్ల పనితీరుపై చర్చించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇళ్లకు అందుతున్న తాగునీటి నల్లా కనెక్షన్ల వివరాలను గ్రామ పాలకవర్గ సభ్యులతో సమీక్షించారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి వి. రమణ సురేష్, ఉపసర్పంచ్ బి. అనిల్ కుమార్, వార్డు సభ్యులు ఎం. సంగ్రామ్, కె. మల్లుగొండ, షాదుల్, నాగనాథ్, హైదర్ సాబ్, గ్రామపంచాయతీ కార్యదర్శి భారద్వాజ్, అంగన్‌వాడీ టీచర్ భాగ్యలక్ష్మి, ఆశా కార్యకర్త డి. నాగమణి, ఫీల్డ్ అసిస్టెంట్ బి. రాజు, కారోబార్ ఎం. గంగారం, వాటర్‌మన్ బి. వీరేశం, స్వీపర్ యశ్వంత్, మిషన్ భగీరథ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *