మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరిన షేక్ మజీద్
షేక్ మజీద్‌తో పాటు సుమారు 100 మంది పార్టీ కండువా కప్పుకున్న వైనం
బీఆర్ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది: గణేష్ బిగాల
పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి
నిజామాబాద్, ఆగస్టు 26: (E6tv NEWS: శివ ఠాకూర్).
నిజామాబాద్ నగరంలోని 29వ డివిజన్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో షేక్ మజీద్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.షేక్ మజీద్‌తో పాటు మహమ్మద్ తాజ్, షేక్ సూఫియన్, షేక్ తోఫిక్, షేక్ మెహబూబ్, షేక్ ముకీత్, అబ్దుల్ బషీర్ తదితరులతో పాటు సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం రోజురోజుకూ మరింత పెరుగుతోందని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ, అందరినీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, సిర్ప రాజు, మాజీ NUDA చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్ మతీన్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, 29వ డివిజన్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

