Breaking News

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దొరకు అభినందనలు

పాల్వంచ, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి).

పాల్వంచ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) సూపరింటెండెంట్ డాక్టర్ దొరను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్–బాబు జగ్జీవన్‌రామ్ వారసుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు.పాల్వంచతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని సకాలంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దొర సేవలను ఐక్యవేదిక ప్రతినిధులు కొనియాడారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఐక్యవేదిక వ్యవస్థాపకులు వానపాకుల రాంబాబు మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో డాక్టర్ దొర చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కొత్తపల్లి శ్రీను, గంగాధర్, సురేందర్, శివాటి మల్లేష్, కొప్పుల శంకర్, ఏల్పుల నరసింహారావు తదితరులు పాల్గొని డాక్టర్ దొరకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *