కలెక్టరేట్ ఉద్యోగి పేరుతో నకిలీ ఐడీ కార్డు
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9: (E6tv NEWS).
రేషన్ కార్డులు ఇప్పిస్తామంటూ కలెక్టరేట్ జూనియర్ అసిస్టెంట్ పేరుతో నకిలీ ఐడీ కార్డు చూపించి పలువురి నుంచి నగదు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. బండి మధు పేరుతో ఉన్న ఐడీ కార్డును చూపిస్తూ రేషన్ కార్డులు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు తీసుకున్నారని తెలిపారు.అయితే కొంతకాలం గడిచినా రేషన్ కార్డులు రాకపోవడంతో బాధితులు ఆరా తీయగా, తమకు చూపించిన ఐడీ కార్డు నకిలీదని తెలిసినట్లు పేర్కొన్నారు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
తమ నుంచి వసూలు చేసిన నగదును తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి, నకిలీ ఐడీ కార్డు సృష్టించి మోసానికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. అధికారులు కూడా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

