Breaking News

తోట వారి వివాహ విందుకు మేనూర్ గ్రామ ప్రజలకు సాదర ఆహ్వానం

కందర్పల్లి DBL గ్రౌండ్‌లో ఆగస్టు 16న వివాహ విందు

మేనూర్, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి).

జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె వివాహ విందు కార్యక్రమానికి మేనూర్ గ్రామ ప్రజలందరూ హాజరై వధూవరులను ఆశీర్వదించాలని పటేల్ గ్రామ సర్పంచ్ అశోక్ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. ఆగస్టు 16వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు కందర్పల్లి–బిచ్కుంద రోడ్డులోని DBL గ్రౌండ్‌లో తోట వారి వివాహ విందు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శుభ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

గ్రామ ప్రజలందరూ కుటుంబ సమేతంగా వివాహ విందు కార్యక్రమానికి తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

వివాహ విందు వివరాలు:
📅 తేదీ: ఆగస్టు 16, ఆదివారం
సమయం: ఉదయం 9:00 గంటలకు
📍 వేదిక: DBL గ్రౌండ్, కందర్పల్లి

ఆహ్వానం:
శ్రీమతి & శ్రీ తోట అర్చన – లక్ష్మీకాంతరావు
ఎమ్మెల్యే, జుక్కల్ నియోజకవర్గం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *