యజమానులకు ఫోన్లు అందజేసిన భీంగల్ పోలీసులు
భీంగల్, ఆగస్టు 11: E6 tv NEWS (T. గంగాధర్).
భీంగల్ మండల పరిధిలో ఇటీవల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి రికవరీ చేశారు. మొత్తం 8 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని సంబంధిత యజమానులకు అందజేశారు.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు లేదా దరఖాస్తు చేయాలని పోలీసులు సూచించారు. ఫోన్ వివరాలను CEIR పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా మొబైల్‌ను త్వరితగతిన ట్రేస్ చేసి రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సమర్థవంతంగా ట్రేస్ చేసి రికవరీ చేయడంలో కృషి చేసిన కానిస్టేబుల్ T. నారాయణను ఈ సందర్భంగా పోలీసులు అభినందించారు.ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.



