Breaking News

రాయచూర్‌లో కాంగ్రెస్ సంస్థాగత బలోపేతానికి కీలక అడుగు

సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా AICC అబ్జర్వర్ తోట లక్ష్మీకాంతరావు పర్యటన

DCC అధ్యక్షుల ఎంపికపై నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల సేకరణ

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యమని స్పష్టం

రాయచూర్, జూలై 29: (E6 tv NEWS,ప్రతినిధి)

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా కీలక అడుగులు వేస్తోంది. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న AICC అబ్జర్వర్, జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో వ్యక్తిగతంగా, గ్రూపుల వారీగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల ఎంపికకు సంబంధించి స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తించి సంస్థాగతంగా కాంగ్రెస్‌ను మరింత బలపర్చడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

కార్యకర్తల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేయడం ద్వారా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కార్యకర్తల అభిప్రాయమే బలం… సమర్థవంతమైన నాయకత్వమే లక్ష్యం… కాంగ్రెస్ పార్టీ బలోపేతమే సంకల్పం” అనే నినాదంతో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *