ముధోల్, జూలై 31 (E6 tv న్యూస్): A, తిరుపతి గౌడ్.
శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ (విజ్ఞాన మేళా)ను ఆగస్టు 30, 31 మరియు సెప్టెంబర్ 1 తేదీల్లో నిర్మల్ జిల్లా ముధోల్‌లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ తెలిపారు.ఈ సైన్స్ ఫేర్‌లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శిశు మందిరాల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని తమ శాస్త్రీయ ప్రతిభను ప్రదర్శించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ముధోల్ పాఠశాలలో నిర్వహించిన విజ్ఞాన మేళా నిర్వహణ ప్రబంధకుల సమావేశంలో పాల్గొన్న పతకమూరి శ్రీనివాస్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, విజయవంతమైన నిర్వహణకు అవసరమైన సూచనలు చేశారు.అలాగే ఇటీవల పదవీ విరమణ పొందిన ఆదిలాబాద్ విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ కలిమహంతి వేణుమాధవ్ను పాఠశాల కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ కలిమహంతి వేణుమాధవ్, జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, పాఠశాల సమితి ఉపాధ్యక్షులు ముత్యాల కిషన్, పాఠశాల అధ్యక్షులు కొండావార్ సంజీవ్, కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్, ప్రధానాచార్యులు, ప్రబంధకులు తదితరులు పాల్గొన్నారు.

