Breaking News

కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు

జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో ముందడుగు

జుక్కల్, ఆగస్టు 18: (E6tv NEWS: ప్రతినిధి).

జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రక కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. కౌలాస్ కోటను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన కోటల జాబితాలో చేర్చడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషి, చొరవతో కౌలాస్ కోటకు మరింత ప్రాధాన్యత లభించిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న కౌలాస్ కోటను ఆధునిక పర్యాటక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు స్థానికులకు ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు.

కోట అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జుక్కల్ నియోజకవర్గానికి గర్వకారణమని, దీనిని ప్రజల తరఫున స్వాగతిస్తున్నామని తెలిపారు. కౌలాస్ కోట పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందితే జుక్కల్ ప్రాంతానికి రాష్ట్రస్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందన్నారు.కౌలాస్ కోట అభివృద్ధి.. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో ముందడుగు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *