Breaking News

నిరుపేదలకు విద్యుత్ సౌకర్యం కల్పించిన పత్తి రాము

మాజీ సొసైటీ చైర్మన్‌కు దళితులు, నిరుపేదల కృతజ్ఞతలు

రుద్రూర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)
ఇల్లు లేని నిరుపేదలు, దళితుల సమస్యను పరిష్కరించేందుకు మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము స్పందించి విద్యుత్ సౌకర్యం కల్పించడంతో లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో కొంతమంది నిరుపేదలు ప్రస్తుతం ఆవాసంగా ఉంటున్నారు. అయితే ఆయా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని పత్తి రాము దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు. దీంతో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో నిరుపేదల ఇళ్లలో వెలుగులు నిండాయి.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ సమస్యను వెంటనే పరిష్కరించిన పత్తి రాముకు, అలాగే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతోమంది నిరుపేదలకు న్యాయం జరిగిందని, తమకు కూడా త్వరలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ జరిగే సమయంలో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *