మద్నూర్ సబ్‌స్టేషన్‌లో వినియోగదారుల నుంచి వినతుల స్వీకరణ
మద్నూర్, ఆగస్టు 6: (E6 tv NEWS M. మస్నాజీ)
మద్నూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా మద్నూర్, బిచ్కుంద, డోంగ్లి, జుక్కల్ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు అందజేశారు.విద్యుత్ సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, కొత్త కనెక్షన్లు, తక్కువ వోల్టేజ్, బిల్లింగ్ తదితర అంశాలపై వినియోగదారులు తమ సమస్యలను వివరించగా, వాటిని పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో CGRF-2 నిజామాబాద్ ఛైర్‌పర్సన్ చవాన్ జైవంత్‌రావు, మద్నూర్ మండల విద్యుత్ శాఖ ఏఈ గోపికృష్ణ, విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాలుగు మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.



