Breaking News

రైతన్నలకు శుభవార్త.. నిజాంసాగర్ నుంచి సాగునీరు విడుదల

నిజాంసాగర్, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి)

రైతులకు శుభవార్త అందింది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పూజలు నిర్వహించి సాగునీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు సాగునీటిని పొదుపుగా, సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.రైతన్నల సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిజాంసాగర్ నుంచి నీటి విడుదలతో ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *