Breaking News

జమ్మికుంటలో అంగన్‌వాడీ చిన్నారులకు స్లేట్లు పంపిణీ

జమ్మికుంట, ఆగస్టు 24: (E6tv NEWS: ప్రతినిధి).

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 6వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు స్లేట్లు, స్లేట్ పెన్సిళ్లను పంపిణీ చేశారు. 6వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు విద్యా సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ స్వర్ణలతమాట్లాడుతూ.. చిన్నారుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. చిన్న వయస్సు నుంచే విద్యపై ఆసక్తి కలిగించడం ద్వారా వారి భవిష్యత్‌కు మంచి పునాది వేయవచ్చని పేర్కొన్నారు.అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు విద్యతో పాటు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సేవలు అందుతున్నాయని తెలిపారు. చిన్నారుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు.

కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్, సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు. చిన్నారుల విద్యాభివృద్ధికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా పలువురు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *