హుజురాబాద్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి).
హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం కోరింది.మంగళవారం సైదాపూర్ మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్పర్సన్ అంజలి, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.

వినతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందిస్తూ, హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

