Breaking News

ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం

మద్నూర్, ఆగస్టు 6: (E6 tv NEWS M. మస్నాజీ)

తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కోతపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.వక్తలు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను నేటి తరానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం మద్నూర్ మండల అధ్యక్షుడు భుజం పంచాల్, గోపాల్ చారి, పండరి చారి, బాలన్న చారి, గుండప్ప చారి, కృష్ణ చారి, జ్ఞానేశ్వర్ చారి, అనిల్ చారితో పాటు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *