మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్
భీంగల్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి).
భీంగల్ మండల పరిధిలో ఫామ్ పాండ్స్ (వ్యవసాయ క్షేత్రాల్లో నీటి నిల్వ గుంతలు), ఇంకుడు గుంతల నిర్మాణాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరా క్రాంతి పథం CCలు, VAOలు, సంబంధిత సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పనుల పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రతి VAO పరిధిలో కనీసం రెండు ఫామ్ పాండ్స్‌ను గుర్తించి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంతోష్ కుమార్ ఆదేశించారు. అదేవిధంగా మండలంలో 50 ఇంకుడు గుంతలను గుర్తించి నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ లక్ష్యాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఏపీఓ నర్సయ్య, ఏపీఎం ప్రమీల, CCలు శ్రీనివాస్, నరేష్, రఘు, VAOలు, VBGRAM సిబ్బంది పాల్గొన్నారు.




